• Neti Charithra

అమరావతి రాజధాని కొనసాగించాలని.. బి కొత్తకోట లో ప్రతిపక్ష పార్టీల నిరసన!



అమరావతి రాజధాని కొనసాగించాలని.. బి కొత్తకోట లో ప్రతిపక్ష పార్టీల నిరసన!



బి కొత్తకోట: నేటి చరిత్ర


ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రాజధాని అమరావతిలో జరుగుతున్న ఉద్యమానికి 200 రోజులు అయిన సందర్భంగా, అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు, అమరావతి పరిరక్షణ బీ.కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో, శనివారం ఉదయం 11 గంటల నుంచీ 12 గంటల వరకు, స్థానిక బైపాస్ రోడ్డు నందు గల జయరాం కొయ్యల మండీ ఆవరణంలో "నిరసన దీక్ష" కార్యక్రమం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ, రాష్ట్ర రాజధానిగా అమరావతి నే కొనసాగించాలని, మూడు రాజధానులు వద్దు- అమరావతే ముద్దు, రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం నశించాలని ప్లే కార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు. ఒక గంట పాటు జరిగిన నిరసన దీక్షను ఉద్దేశించి టిడిపి రాష్ట్ర కార్యదర్శి యస్.ఎం. పర్వీన్ తాజ్, కాంగ్రెస్ పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ ఎమ్.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, సిపిఐ నియోజకవర్గపు కార్యదర్శి యస్. మనోహర్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు యస్. సయ్యద్ బాషా, బిజెపి నాయకులు కే.రవీంద్ర, బాస్ నాయకులు సచిన్, మాలమహానాడు నాయకులు విశ్వనాధ్ తదితరులు ప్రసంగించారు. 2019 డిసెంబర్ నెల 17వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆఖరి రోజున, మూడు రాజధానులు పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్థావనలేని ఏకపక్షంగా అసెంబ్లీలో చేసిన ప్రకటనతో ప్రారంభమైన అన్నదాతల పోరాటం, ఎన్నో ఒడిదుడుకులు, నిర్బంధాలు, అక్రమ కేసులు, లాఠీచార్జీల మధ్య నిర్విరామంగా కొనసాగుతున్నదని, ప్రభుత్వ పిచ్చి చర్యలను కోర్టులు సైతం తప్పు పడుతున్నాకూడా రాష్ట్ర సర్కారు మొండిగా ముందుకెళుతోందని ఆవేదన చెందారు. స్వయానా దేశ ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారని,దానిని కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, వెంటనే జోక్యం చేసుకుని రాజధానిని తరలించకుండా ఆపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యొక్క "చారిత్రక మహోన్నత ఉద్యమం" వృధా కాదని అమరావతి పరిరక్షణ సమితి ధర్మ పోరాటానికి అనూహ్య మద్దతు ఉన్నదని,విజయం తధ్యమని ఘంటా పథంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు

టి. సుకుమార్,డి. నారాయణ, ఎం.డి మస్తాన్,కుమార్ లు జనసేన పార్టీ నాయకులు టి. మనోహర్, సిపిఐ నాయకులు ఎమ్.అష్రఫ్ అల్లి, యస్.తంబయ్యశెట్టి,యస్.షంషుద్దీన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


291 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon