• Neti Charithra

అమరావతి పోలీసుల పై .. హైకోర్టు ఆగ్రహం !

అమరావతి: నేటి చరిత్ర (జనవరి17)

అమరావతి పోలీసుల ఫై.. హై కోర్టు ఆగ్రహం !

రాజధాని గ్రామాల్లో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్టు 30 అమలు చేయడంపై అమరావతి రైతులు, మహిళలు, న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ దాదాపు గంట పాటు వాదనలు వినిపించారు. 2014 నుంచి అమరావతిలో 144 సెక్షన్‌ ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. 144 సెక్షన్‌ను రాజధానిలో పొడిగించినట్టు వివరించారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతోనే రైతులను అడ్డుకున్నట్టు ఏజీ తెలిపారు. అయితే, రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 610 మందిపై కేసులు పెట్టడంపైనా న్యాయమూర్తులు ఏజీని వివరణ అడిగారు. బెంజ్‌ సర్కిల్‌ వద్ద ర్యాలీకి వెళ్తున్నందునే అరెస్టు చేశామని ఆయన బదులిచ్చారు. రాజధానిలో పోలీసులు భారీ స్థాయిలో కవాతు ఎందుకు నిర్వహించారు? మందడంలో మహిళను పోలీసులు బూటు కాలుతో ఎందుకు తన్నారు? ఆందోళనలో మహిళల నోరు ఎందుకు నొక్కారు? అంటూ న్యాయమూర్తులు ఏజీని ప్రశ్నించారు. మగ పోలీసులు మహిళలను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని నిలదీశారు. దీనికి ఏజీ స్పందిస్తూ.. శాంతిభద్రతల సమస్యలు వస్తాయనే అమరావతిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. సమగ్రంగా ప్రమాణపత్రం ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్