• Neti Charithra

అమరావతి పోలీసుల తీరు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ !

అమరావతి: నేటి చరిత్ర (జనవరి8)

అమరావతి పోలీసుల తీరు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండి పడ్డారు.

రాజధాని రైతులు ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.చినకాకాని వద్ద రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదన్నారు. రైతులను, మహిళల్ని భయపెట్టి వారిని నిరసన నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. నిరసనలు ప్రారంభం కాకముందే తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ను గృహనిర్బంధంలో ఉంచారన్నారు. పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్‌ను కారణం చెప్పకుండానే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటే అవుతుందన్నారు. చినకాకానిలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై ఆయన మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు.