• Neti Charithra

అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని..బి కొత్తకోట లో నిరసనలు..!


అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని..బి కొత్తకోట లో నిరసనలు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర



అమరావతి రాజధాని రక్షణ పోరాటం నేటికి 250 రోజులకు చేరుకున్న సందర్భంగా, "అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని" "రాజ్యాంగాన్ని పరిరక్షించాలని" కోరుతూ అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో

భాగంగా, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జ్యోతి బస్టాండ్ లోనిబేద్కర్ గారి విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.

రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వ మూడు ముక్కలాట నశించాలని నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను మార్చుకుని, అమరావతినే రాష్ట్ర రాజధాని గా కొనసాగించేలా తమరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనస్సును మార్చాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రాంతీయ కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ; నాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ సిపీ పార్టీ తోసహా అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా కొనసాగించడానికి అంగీకరించాయని, నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ఆమోదయోగ్యమైనదని, అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉన్నదని, 31 వేల ఎకరాల భూమి అవసరం అని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి మద్దతు తెలిపారన్నారు.అప్పటి ప్రభుత్వం వన్ 28 వేల మంది రైతుల దగ్గర నుండి 33 వేల ఎకరాలు భూమి సేకరించి రాజదాని పనులు చేపట్టిందన్నారు. ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి లో స్వగృహం ఏర్పాటు చేసుకుని రాజధాని మార్చమని ప్రజలను నమ్మించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానం చూస్తుంటే, "ఏరుదాటేంత వరకు ఓడ మల్లన్న" "ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న" చందంగా ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో ఒకవైపు కరోనా రోజురోజుకూ విజృంభిస్తూ మూడు లక్షలకు పైగా కేసులు,మూడు వేల మరణాలు నమోదైన పరిస్థితి వున్నదని, కరోనా పై పోరాడుచున్న వైద్య సిబ్బందికి తగినన్ని రక్షణ పరికరాలు సమకూర్చ లేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం, మూడు రాజధానులు మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడడంలో చూపకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎస్.బషీర్ ఖాన్,హెచ్.షమీ వుల్లా, మండల నాయకులు ఎం.అష్రఫ్ అల్లి,ఎస్.తంబయ్య శెట్టి,ఎస్.శంశుద్దీన్,జీ.ఎం.బాషా,గంగులప్ప తదితరులు పాల్గొన్నారు.


335 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon