• Neti Charithra

అమరావతి కి మద్దతుగా మదనపల్లె లో నిరసనలు..!


అమరావతి కి మద్దతుగా మదనపల్లె లో నిరసనలు..!



మదనపల్లె:నేటి చరిత్ర


రాజదాని గా అమరావతి ని కొనసాగించాల ని కోరుతూ సీపీఐ నేతలు చిత్తూరు జిల్లా మదనపల్లె లో సోమవారం

సబ్ కార్యాలయం ఎదుటనిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమాల్లో పాల్గొన్న సీపీఐ మదనపల్లి నియోజకవర్గ

కార్యదర్శి సాంబశివ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణప్ప,సీపీఐ మదనపల్లి పట్టణ కార్యదర్శి మురళి

లు మాట్లాడుతూ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు,మహిళలు చేస్తున్న దీక్షలు ఈ నెల 12 వ తేదీకి 300 రోజులు కావొస్తున్న సందర్భంగా రైతులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన లు చేపట్టామన్నారు.వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత మూడు రాజదానులు నిర్ణయంతో ఇప్పటివరకు అమరావతి ప్రాంతంలో 92 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని,అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనంలేదన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన

రైతులు తీవ్ర మానసిక క్షోభతో పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహనరెడ్డి మొండి వైఖరి విడనాడి అమరావతినే రాజదానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్ కుమార్,రెడ్డప్ప,రవి,వెంకటరమణ,కాటయ్య,నరసంహులు,రెడ్డి,తదితరులు పాల్గొన్నారు


59 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon