• Neti Charithra

అమరావతి- అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవే కు భూములు ఇవ్వం అంటూ.. తిరబబడ్డ రైతులు!

#అమరావతి- అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవే కు భూములు ఇవ్వం అంటూ.. తిరబబడ్డ రైతులు!

అమరావతి: నేటి చరిత్ర(నవంబర్21) అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే మార్గానికి భూములు ఇచ్చే విషయం లో రైతులు తిరగబడ్డారు. అమరావతి-అనంతపురం మార్గం నిర్మించే విషయంపై అధికారులు బుధవారం మేడికొండూరు తహసీల్దారు కార్యాలయం వద్ద అభిప్రాయ సేకరణకు సభ నిర్వహించారు. మండల పరిధిలోని మేడికొండూరు, విశదల, మందపాడు, యలవర్తిపాడు రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ రహదారి నిర్మిస్తే ఎంతో మంది భూమి కోల్పోతామని వారు చెప్పారు. మాకొన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఎంత ధర చెల్లించినా తమ భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. తమ అభిప్రాయం తీసుకోకుండా హైవే నిర్మించాలని నిర్ణయం తీసుకోవటం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ లెక్కల ప్రకారం మేడికొండూరు మండల పరిధిలో ఎకరా భూమి రూ.8లక్షలు ఉందని, దీనికంటే రెండున్నర రెట్లు ధర అధికంగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు స్పందించి, ఎంత ధర చెల్లించినా భూమి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న రహదారి అభివృద్ధి చేస్తే సరిపోతుందని, ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గుతుందని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ శైలజ, తహసీల్దారు సుజాత, డిప్యూటీ తహసీల్దారు దుర్గేష్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.