• Neti Charithra

అప్పులు.. భారం.. భరించలేక.. ములకలచేరువు లో రైతు ఆత్మహత్య !


అప్పులు.. భారం.. భరించలేక.. ములకలచేరువు లో రైతు ఆత్మహత్య !ములకలచేరువు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచేరువు మండలం లో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దపాళ్యం పంచాయతీ గోళ్లపల్లె కు చెందిన రైతు బయన్న కు వ్యవసాయం లో నష్టాలు అధికం అయ్యాయి. అతను పలువురి వద్ద అప్పులు చేశారు. ఈ నేపథ్యం లో గత నెల 27 న ఇంటినుంచి అతను వెళ్లి నట్లు తెలుస్తోంది. కాగ అతను కనుగొండ అటవీ ప్రాంతం పై భాగం లో ఉసిరి చెట్టు కు ఉరి

వేసుకొని అత్మహత్య కు పాల్పడినట్లు గుర్తించారు. అక్కడి పరిస్థితిని గుర్తిస్తే.. అతను మృతి చెంది వారం రోజులు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎస్ ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.