- Neti Charithra
అప్పుల భారం అధికమై చిత్తూరు జిల్లా లో యువరైతు ఆత్మహత్య..!
అప్పుల భారం అధికమై చిత్తూరు జిల్లా లో యువరైతు ఆత్మహత్య..!
పెద్దపంజాని: నేటి చరిత్ర
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా
పెద్దపంజాని మండలం లోని అప్పినపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బుషిరెడ్డి కుమారుడు రెడ్డప్పరెడ్డి(33) కౌలుకి వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల ఊబిలో కురుకపోవడంతో, వ్యవసాయం చేయడం ఇక వద్దు, ఇప్పటికే అప్పుల పాలు ఐపోయాం అని ఇంట్లో
వాళ్ళు చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలిసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న రైతు మృతితో అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
182 views0 comments