• Neti Charithra

అప్పుల బాధ భరించలేక... చిత్తూరు జిల్లా లో మహిళా రైతు ఆత్మహత్య!

#అప్పుల బాధ భరించలేక... చిత్తూరు జిల్లా లో మహిళా రైతు ఆత్మహత్య!

వరదయ్యపాళ్ళెం : నేటి చరిత్ర (సెప్టెంబర్21) అప్పుల బాధ భరించలేక ..వేసిన పంటలు సక్రమంగా పండక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓమహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.... వరదయ్యపాళ్ళెం మేజర్ పంచాయతీ శాటిలైట్ కాలనీకి చెందిన పీ. మునస్వామీ నాయుడు భార్య పీ.బుజ్జమ్మ (55) వీరు పంట పొలాలను నమ్ముకొని వర్షాలు కురవక పోవడంతో సాగు నీటి బోరు వేసుకొని ప్రతి సంవత్సరం వేరు శెనగ, పైరు పెట్టుకొని తద్వారా కుటుంబ జీవనాన్ని కొనసాగించే వారు. ఐతే గత సంవత్సరంలో వేసిన పంటకు వర్షాలు కురవకోవడంతో దానికి తోడు వేసిన సాగు నీటి బోరులో నీరు లేక, వేసిన పంటలు దిగుబడి లేకపోవడం వలన అప్పులు తీర్చలేక బెంగ పెట్టుకున్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆలోచిస్తూ బుజ్జమ్మ భర్త మునస్వామీ నాయుడు అనారోగ్య పాలైయ్యాడు. దీంతో దిక్కు తోచలేని పరిస్థితుల్లో మనస్తాపానికి గురైన బుజ్జమ్మ ఈ నెల 11వ తేదీ బుధవారం పురుగుల మందు తాగింది. గమనించిన స్థానికులు హుటా హూటినా శ్రీ కాళహస్తి లోని యం.జీ.యం ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అప్పటి నుండి పది రోజుల పాటు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందింది. దీనిపై వరదయ్యపాళ్ళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బజ్జమ్మ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.