• Neti Charithra

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య.. భార్య గుండెపోటు తో మృతి!


అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య.. భార్య గుండెపోటు తో మృతి!





కడప: నేటి చరిత్ర



కడప జిల్లా గాలివీడు మండలంలోని గోరాన్‌చెరువు పంచాయతీ బిసి కాలనీకి చెందిన పందికుంట ఎర్రంరెడ్డి (59) అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణం జీర్ణించుకోలేని భార్య రెడ్డమ్మ(49) గుండెపోటుతో మరణించారు. మృతునికి రెండు ఎకరాల సొంత భూమి, మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరు ఎకరాల్లో లక్ష రూపాయలు వ్యయం చేసి దోస పంటను సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో మార్కెట్‌ సదుపాయం లేకపోవడంతో అప్పులు మిగిలాయి. అప్పు తీర్చే దారి లేక ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న భార్య పొలం నుంచి ఇంటికి వచ్చింది. భర్త మృతుని తట్టుకోలేక గుండెపోటుతో ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.