• Neti Charithra

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

#అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

వేంపల్లి:నేటి చరిత్ర (ఆగస్టు25) క‌డ‌ప జిల్లా వేంపల్లె మండలంలోని నాగూరు గ్రామానికి చెందిన నాగేండ్ల సంజీవ రెడ్డి (45) అనే రైతు అప్పుల బాధ తాళ లేక విష గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వేకువ జామున చోటు చేసుకుంది. పంటలు పండక, బోర్లు వేసిన‌ అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకొన్నట్లు మృతుని బంధువులు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా పంటల సాగు కోసం దాదాపు 13 అప్పులు చేసినట్లు మృతుని చిన్న కుమారుడు వినోద్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా నాలుగేళ్ల క్రితం పెద్ద కుమారుడు శివ కుమార్ రెడ్డి కూడ బోన్ క్యాన్సర్ తో మృతి చెందాడు. వైద్య ఖర్చులు కొసం కూడ అప్పులు చేసినట్లు తెలిపారు. రుణ భారం ఎక్కువ అయ్యి ఇంటిలో ఎవరూ లేని సమయంలో విష గుళికలు మింగినట్లు బంధువులు తెలిపారు. మృతుని భార్య రమాదేవి వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి చేరుకొని తలుపులు తీయగా భర్త అపస్మారక స్థితిలో ఉన్నాడని బంధువులకు, స్థానికులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కొసం కడప రిమ్స్ కు తరలించగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. తీవ్ర వర్షాభావంతో నష్టాలు వచ్చాయి. అప్పు ఎలా తీర్చాలో తెలియక రైతు సంజీవరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై విషగుళికలు తిని ఆత్మహత్య చేసుకొన్నట్లు పేర్కొన్నారు.