• Neti Charithra

అప్పుడే.. పుట్టి.. అప్పుడే మట్టి లో కలిసి.. మానవత్వం... మంటలో కలిసిన వేళ !

#అప్పుడే.. పుట్టి.. అప్పుడే మట్టి లో కలిసి.. మానవత్వం... మంటలో కలిసిన వేళ !

గజపతి నగరం: నేటి చరిత్ర (ఆగస్టు27) అప్పుడే పుట్టిన పసికందును గుంతలో పారేసిన వైనం మంగళవారం విజయనగరం జిల్లా గజపతినగరంలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారం మేరకు .. గజపతినగరం గ్రామంలో ఎన్‌హెచ్‌ 26 రహదారి పక్కన రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న గుంతలో గుర్తు తెలియని వ్యక్తులెవరో పుట్టిన పసికందును పారేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మానవత్వపు విలువల్ని మట్టి లో కలిపాయనే విమర్శలు వేలు వెత్తుతున్నాయి.