• Neti Charithra

అపశృతులు లేకుండా వినాయక చవితిని జరుపుకోండి- ఎస్ ఐ సుమన్

#అపశృతులు లేకుండా వినాయక చవితిని జరుపుకోండి- ఎస్ ఐ సుమన్

బి కొత్తకోట: నేటి చరిత్ర (ఆగస్టు28) చిత్తూరుజిల్లా బి కొత్తకోట మండల పరిధిలో వినాయకుని విగ్రహాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే నిర్వహకులు అందుకు అవసరం అయిన అనుమతులను పోలీస్ శాఖనుంచి పొందాలని ఎస్ ఐ సుమన్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి అపశృతులు జరుగకుండా ఉండేందుకు వీటికి అనుమతులు తప్పని సరన్నారు. నిబంధనల మేరకు అనుమతి పొందిన విగ్రహాల వద్ద రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారదన్నారు. మద్యం తగి గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. వినాయకుని విగ్రహాలను మూడు లేక ఐదు రోజుల లోగ నిమజ్జనం కార్యక్రమాల్ని ఆయా నిర్వాహకులకు కేటాయించిన మార్గాలలో సాయంత్రం 6 గంటల లోగ పూర్తి చేసుకునే బాధ్యత నిర్వహకులదేనని ఆయన చెప్పారు. వినాయక చవితి పండుగను మంచి వాతావరణం లో చేసుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.

35 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon