• Neti Charithra

అన్యమత ప్రచారం పై విచారణకు ఆదేశించిన మంత్రి

#అన్యమత_ప్రచారం_పై_విచారణకు_ఆదేశించిన_మంత్రి

అమరావతి: నేటి చరిత్ర (ఆగస్టు23) తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచార వ్యవహారంపై ప్రభుత్వం దృష్టికి రాగానే విచారణకు ఆదేశించామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లు నిబందనలకు విరుద్ధంగా తిరుపతి డిపోకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఆ టిక్కెట్లు టిడిపి హయాంలోనే ముద్రించినట్లుగా తేలిందన్నారు. టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్లుగా వెల్లడవుతోందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం శుక్రవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ ఫ్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షం సర్వశక్తులు వడ్డుతోందన్నారు. విషప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి పేర్కొన్నారు. తిరుమల, తిరుపతి ప్రతిష్టతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై చట్ట ప్రకారం నడుచుకుంటామని మంత్రి తెలిపారు. మతాలన్నీ అక్కున చేర్చుకున్నందువల్లే జగన్‌ అందరివాడయ్యారని, మతాలన్నీ ఛీకొట్టడంతో చంద్రబాబు అందరికీ దూరమయ్యారని పేర్కొన్నారు. 40దేవాలయాలను కూలగొట్టించింది, సదావర్తి భూములు కాజేసేందుకు ప్రయత్నించడం, కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్రపూజలుచేయించింది టిడిపి ప్రభుత్వ హయాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు