• Neti Charithra

అనుమానాస్పద స్థితి లో.. మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి!

#అనుమానాస్పద స్థితి లో.. మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి!

హైదరాబాద్: నేటి చరిత్ర (డిసెంబర్4) హైదరాబాద్ నగరం లోని సనత్ నగర్ లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మంగళవారం సాయంత్రం రామారావునగర్ లోని ఇంట్లో అన్నపూర్ణ అనుమనాస్పద స్థితితో చనిపోయింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అన్నపూర్ణ 20రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. దాసరి కార్తీక్ అనే యువకుడిని అన్నపూర్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు అన్నపూర్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.