- Neti Charithra
అనుమానం తో.. భార్యగొంతుకోసి.. హత్య చేసిన భర్త.. తాను ఆత్మహత్యాయత్నం..చిత్తూరు జిల్లా లో దారుణం..!
అనుమానం తో.. భార్య గొంతుకోసి.. హత్య చేసిన భర్త.. తాను ఆత్మహత్యాయత్నం చిత్తూరు జిల్లా లో దారుణం..!
వి కోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా వి.కోట మండలం లో అనుమాన భూతం తో కట్టుకున్న భార్య ను భర్తే హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..వి కోట మండలం
పాముగానిపల్లెలో భార్య రేణుక ను గొంతు
కోసి భర్త ప్రభాకర్‌రెడ్డి హతమార్చాడు. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.భార్య మృతి చెందింది. కొనఊపిరితో ఉన్న ప్రభాకర్ ను ఆస్పత్రికి తరలించారు.అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.భార్యపై అనుమానం తోనే ఈ హత్య చేశాడని గ్రామస్తులు
తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.