• Neti Charithra

అన్నం లో వెంట్రుక వచ్చిందని భార్య కు గుండు కొట్టించిన కసాయి భర్త !

#అన్నం లో వెంట్రుక వచ్చిందని భార్య కు గుండు కొట్టించిన కసాయి భర్త !

బంగ్లాదేశ్: నేటి చరిత్ర (అక్టోబర్8) అన్నంలో వెంట్రుక వచ్చిందని భార్యపై ఆగ్రహించిన ఓ భర్త వికృత చేష్ట కు దిగిన ఘటన సభ్య సమాజానికి తలదించుకునేల చేసింది. ఆ ..అలక్ష్యానికి ఇదే తగిన శిక్ష అంటూ ఆమెకు గుండు కొట్టాడు. ఈ దారుణం బాంగ్లాదేశ్‌లోని జాయ్‌పూర్ ఘాట్ జిల్లాలో ఇటీవలే చోటుచేసుకుంది. బబ్లూ మొండల్ అనే వ్యక్తికి అతడి భార్య ఎప్పట్లాగే ఆ రోజు అన్నం వడ్డించింది. అన్నం కలుపుకునేటప్పుడు అతడు పొడవాటి వెంట్రుక గమనించాడు. భార్య అలక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని బబ్లూ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెతో గొడవకు దిగాడు. అనంతరం.. ఆమె వద్దని మొరపెట్టుకున్నా వినకుండా..బలవంతంగా శిరోముండనం చేశాడు. ఈ ఘటన బాంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టిస్తోంది. మహిళా సంఘాలు ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..గృహహింస నేరంపై బబ్లూను అరెస్టు చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon