• Neti Charithra

అన్నవరం లో ఇద్దరు దంపతుల ఆత్మహత్య!

#అన్నవరం లో ఇద్దరు దంపతుల ఆత్మహత్య!

అన్నవరం: నేటి చరిత్ర (అక్టోబర్8) కృష్ణా జిల్లా అన్నవరంలో ఇద్దరు దంపతులు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఓ లాడ్జ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన పవన్‌, ధనలక్ష్మిగా గుర్తించారు. పవన్‌ హైదరాబాద్‌లో ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరి స్వగ్రామం కృష్ణాజిల్లా మచిలీపట్నం. ఘటనాస్థలంలో ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక సమస్యలతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడిఉంటారని పోలీసులు భావిస్తున్నారు.