• Neti Charithra

అనాథ పిల్లలకు మిట్స్ విద్యార్థుల అన్నదానం!

#అనాథ పిల్లలకు మిట్స్ విద్యార్థుల అన్నదానం!

మదనపల్లె: నేటి చరిత్ర (అక్టోబర్20) మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లె(మిట్స్ ఇంజనీరింగ్) కళాశాల నందు గల మిట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్ (ఏం.ఎస్.ఆర్ క్లబ్) వారు స్థానిక మదనపల్లె లో గల చైతన్య బాలల అనాధ ఆశ్రమం లోని పిల్లలకు భోజనం మరియు పెన్నులు, పెన్సిల్, నోట్ పుస్తకాలు మరియు ఇతర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ఇందులో విద్యార్ధి కోఆర్డినేటర్ మనోజ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై శ్రద్ద వహించాలని అన్నారు. మేము అనాథలం మాకు ఎవరు లేరు అనే భావన మదిలో నుంచి చెడిపేయాలని అన్నారు. మీకు ఏ అవసరమైన మేము ఉన్నాం అని గుర్తించుకోవాలని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మనం చదువుకుంటే ఇలాంటి ఎంతో మంది అనాధ పిల్లలకు సహాయం చేయవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు గుర్తించుకోవలసిన విషయం కూడా చదువు అన్నారు. మీది చదువుకొనే వయసు అని అన్నారు. మిట్స్ అధ్యాపకుడు అభినయ్ మాట్లాడుతూ ప్రతి మనిషి ఇతరులకు సహాయం చేయాలి, అందులో కలిగే అనుభూతిని ఆస్వాదించాలని కొందరికి మాత్రమే ఉంటుంది అని అన్నారు. సమాజం లో విధి వక్రీకరంచి అనాథలుగా మారిన పిల్లలను ఎగతాలిగా చూడకూదని, వీలైతే వారిని అక్కున చేర్చుకోవాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని, ప్రతి ఒక్కరు వీరికి మేమున్నాం అనే ధైర్యాన్ని నింపాలని అన్నారు. విద్యార్థులు ఆశ్రమం లోని విద్యార్థులకు "మానవత్వం, పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహనా సదస్సును నిర్వహించారు. పిల్లలకు ఆటల పోటీలను నిర్వహించారు.

విద్యార్థులకు మోటివేషనల్ వీడియోస్ ను విద్యార్థులకు చూపించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్న విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత గురించి వివరిస్తూ ప్రతి ఒకరికి శుభ్రత ఎంతో అవసరమని, వారున్న పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో ఏం.ఎస్.ఆర్ క్లబ్ విద్యార్థులు మనోజ్, జస్వంత్, సుభాకర్, షణ్ముఖ, వంశి, హరి, పావని, శిరీష, ఆనంద్ మరియు చైతన్య లు పాల్గొన్న వారిలో ఉన్నారు.