• Neti Charithra

అనంతపురం లో మిడతల.. కల కలం.. చివరకు ఊపిరి పీల్చుకున్న రైతులు !


అనంతపురం లో మిడతల.. కల కలం.. చివరకు ఊపిరి పీల్చుకున్న రైతులు !
అనంతపురం: (నేటి చరిత్ర)


దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కల కలం రేపుతున్న మిడత ల దాడి .. తెలుగు రాష్ట్రాల్లో రైతులను కలవరం పెడుతోంది.

తాజాగానంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దాసప్పరోడ్డులో జిల్లేడు

మొక్కలపై గురువారం కనిపించిన ఓ మిడతల దండు స్థానికంగా కలవరం రేపింది. ఈ గుంపులో 100-150 మిడతలే ఉన్నా... మహారాష్ట్రలో ఇప్పటికే పంటలను నాశనం చేస్తున్న పెద్ద మిడతల దండు అనుకుని

స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత అవన్నీ దేశీయ మిడతలేనని అధికారులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం సాయంత్రం మిడతల దండుపై అగ్నిమాపక శాఖ

అధికారులు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయడంతో అవన్నీ చనిపోయాయి. పెనుకొండలోనూ ఈ తరహా మిడతల జాడ కనిపించింది. దింతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు.


266 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon