• Neti Charithra

అనంతపురం - ఢిల్లీ కిసాన్ రైలు ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..!


అనంతపురం - ఢిల్లీ కిసాన్ రైలు ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..!అమరావతి: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా రైతుల వ్యవసాయ దిగుబడులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే నిమిత్తం ప్రత్యేకంగా కిసాన్ రైలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కిసాన్ రైలును ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. తన చాంబర్ లోనే సీఎం జగన్ రైల్ వెబ్ పోర్టల్ ద్వారా ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే పచ్చ జెండా ఊపడంతో కిసాన్ రైలు

ముందుకు కదిలింది. అదే సమయంలో, కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగాడి, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఢిల్లీ నుంచి జెండాలు ఊపి రైలుకు శ్రీకారం చుట్టారు.

ఈ కిసాన్ రైలు ద్వారా అనంతపురం జిల్లా పండ్ల ఉత్పత్తులను దేశ రాజధానిలో మార్కెటింగ్ చేసేందుకు వీలు కలగనుంది. తద్వారా రైతులకు మరింత మెరుగైన గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అనంతపురం నుంచి అనేక రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ కు కూడా ఫలాలు ఎగుమతి అవుతుంటాయి

కాగా, ఈ కిసాన్ రైలు తొలి ప్రయాణంలో 500 టన్నుల వివిధ రకాల పండ్లు, రైతులు, వ్యాపారులు, అధికారులు ప్రయాణించేందుకు ప్రత్యేక స్లీపర్ కోచ్ ఏర్పాటు చేశారు. రైతులు సత్వరమే తమ పంటలను ఢిల్లీ తరలించేందుకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.


156 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon