• Neti Charithra

అనంతపురం జిల్లా లో ముగ్గురు ఆత్మహత్య....!

#అనంతపురం జిల్లా లో ముగ్గురు ఆత్మహత్య..!

అనంతపురం: నేటి చరిత్ర (సెప్టెంబర్30) అనంతపురం జిల్లాలో వివిధ కారణాలతో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అనాథగా ఉంటూ జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఓ సాధువు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బుక్కపట్నం మండల పరిధిలోని ప్రధాన రహదారిలో ఆదివారం చోటు చేసుకోగ పో లీసుల కథనం మేరకు వివరాలు.. ఒరిస్సా రా ష్ట్రం నుంచి వలస వచ్చి గత కొన్నేళ్లుగా పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో జీవిస్తూ సత్యసాయి భక్తుడిగా మారి ఏకాకి అయిన పూజారి ఆ చారి(74) పుట్టపర్తి సమీపంలోని కర్ణాటకనాగేపల్లి వద్దనున్న ఆశ్రమంలో జీవించేవాడు. ఆశ్రమ నిర్వాహకురాలైన అనిత పాండే అ తని వైఖరి నచ్చక ఆశ్రమం ఖాళీ చేయమని చెప్పింది. దీంతో దిక్కులేని వృద్ధుడు కలత చెంది ఆశ్రమం ముందుగల చెట్టు ఎక్కి తన పంచెతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని తరలించారు. కాగా ఈ ఉదంతంపై పోలీసులు ప్రధాన రహదారి లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజ్‌లో నిక్షిప్తమైన దృశ్యాన్ని అనుసరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉరివేసుకొని ఆటో డ్రైవర్‌.. గుత్తిరూరల్‌ : మండలంలోని బేతాపల్లికి చెందిన ఆటోడ్రైవర్‌ ప్రకాష్‌ (26) ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఆటో డ్రైవర్‌ ప్రకాష్‌ హైదరాబాదు లో ఆటోలో చెత్తను తరలిస్తూ జీవనం కొనసాగించేవాడు. అప్పులు ఎక్కువ కావడంతో ఆటోను అమ్ముకొని నెలరోజుల క్రితం గ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో చీరతో ఉరివేసుకొని అపస్మారక స్థితిలో పడిఉండడంతో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు సంతానం కలరు. గుడిబండలో మరో యువకుడు.. గుడిబండ : మండలంలోని రాళ్లపల్లికి చెం దిన ఖలీల్‌బేగ్‌ కుమారుడు లతీఫ్‌(28) అనే యువకుడు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ మస్తాన్‌ తెలిపా రు. ఆదివారం ఎస్‌ఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. లతీఫ్‌ కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

8 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon