• Neti Charithra

అధిక విద్యుత్ బిల్లులు ఇచ్చారని.. సిబ్బందిని తాళ్ళతో కట్టేసిన గ్రామస్థులు..!



అధిక విద్యుత్ బిల్లులు ఇచ్చారని.. సిబ్బందిని తాళ్ళతో కట్టేసిన గ్రామస్థులు..!



మెదక్: నేటి చరిత్ర


మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో విద్యుత్తు బిల్లుల వసూళ్లకు వచ్చిన విద్యుత్తు అధికారులను   పిల్లర్ కు తాడుతో కట్టి నిర్బంధించారు గ్రామస్థులు. గ్రామంలో నెలకొన్న కరెంట్ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్

చేశారు. అలానే విద్యుత్తు ఉన్నతాధికారులు వచ్చేవరకు వదిలేది లేదని అంటూ గ్రామస్థులు వారిని నిర్బంధించారు. అధిక విద్యుత్ బిల్లులు, సరఫరాలో అంతరాయం పై విద్యుత్ అధికారులను నిలదీస్తున్నా  పట్టించుకోవడం లేదని కరెంటు బిల్లుల

వసూలుకు వచ్చిన విద్యుత్‌ సిబ్బందిపై తమ ప్రతాపం చూపించారు. వారిని తాళ్లతో స్తంభానికి కట్టేశారు. పై అధికారుల జోక్యం తో విద్యుత్ సిబ్బందికి విముక్తి లభించింది. అయితే విద్యుత్ అధికారులు బంధించిన గ్రామస్థులపై కేసు నమోదు చేశారు. 



308 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon