• Neti Charithra

అధికారుల సహకారం.. లేదని ఆత్మహత్య కు పాల్పడ్డ 108 డ్రైవర్ !


అధికారుల సహకారం.. లేదని ఆత్మహత్య కు పాల్పడ్డ 108 డ్రైవర్ !



కర్నూలు: నేటి చరిత్ర


కర్నూలు జిల్లా లో ఓ108 వాహన డ్రైవర్‌ రమేష్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మద్దికెరకు చెందిన రమేష్‌ ప్రస్తుతం కోసిగిలో పని చేస్తున్నారు. శనివారం సాయంత్రం విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరారు. ఆదివారం ఉదయం మద్దికెర-బురుజుల రహదారిలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. అటుగా వెళ్తున్న వారు కుటుంబ సభ్యులకు సమచారం అందించారు. ఈ విషయం

తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్సై కృష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పత్తికొండకు తరలించారు. కొత్త వాహనాలు మద్దికెరకు రావడంతో ఇక్కడే తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని పలుమార్లు విన్నవించినా యాజమాన్యం పట్టించుకోని కారణంగానే మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని భార్య అనంతలక్ష్మి, కుటంబ సభ్యులు హనుమంతు తదితరులు ఆరోపిస్తున్నారు.