- Neti Charithra
అధికారుల తీరును నిరసిస్తూ.. మదనపల్లె లో నిరసనలు చేసిన బిసి హక్కుల కమిటీ..!
అధికారుల తీరును నిరసిస్తూ.. మదనపల్లె లో నిరసనలు చేసిన బిసి హక్కుల కమిటీ..!
మదనపల్లె: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా మదనపల్లె లో
మహాత్మ జ్యోతిరావుఫూలే విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని బీసీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా
నిర్వహించారు. ఈ సందర్భంగా
బిసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ మాట్లాడుతూ
మహాత్మ జ్యోతిరావుఫూలే విగ్రహం ఏర్పాటుకు మున్సిపాలిటీ పరిధిలో రెండు
అడుగుల స్థలం చూపించడంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని
విమర్శించారు. బుధవారం అంబేద్కర్ సర్కిల్ వద్ద బిసి హక్కుల పోరాట సమితి ఆద్వర్యంలో నిరసన లు చేశారు.రెండు సంవత్సరాలుగా విగ్రహం తయారు
చేయించి వుంచామని సరైన స్దలం చూపించాలని మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ మొదలుకొని మంత్రి వరకు విన్నవింవిన స్పందించే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ 20 వినతిపత్రాలు ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగిందని తెలిపారు. అధికార, ప్రతిపక్ష నాయకులు జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటుకు ఎకరాలకు ఎకరాలలు కబ్జా చేసే నాయకులు మహాత్మల విగ్రహాల ఏర్పాటుకు జానెడు స్దలం చూపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మొదట గురువు మహత్మ జ్యోతిరావు ఫూలే అని అలాంటి వ్వక్తి విగ్రహం ఏర్పాటు ఎంతో అవసరమని అన్నారు. బిసిల ఓట్లుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు బిసిల ఆరాధ్య దైవం మహాత్మ ఫూలే విగ్రహం ఏర్పాటుకు మాత్రం సహకరించలేదని విమర్శించారు. విగ్రహం ఏర్పాటుకు స్దలం చూపించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి, ఓబిసి ఉద్యోగ సంఘం నాయకులు గంగయ్య గౌడ్, శ్రీనివాసులు, నాగరాజు, రామలింగ, ఉత్తన్న, ప్రభాకర్, అమరావతి తదితరులు పాల్గొన్నారు.