• Neti Charithra

అదుపుతప్పి ముళ్లపొదల్లో కి దూసుకెళ్లిన బస్సు



బుచ్చినాయుడు కండ్రిగ (20 April 2021) : బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని శ్రీకాళహస్తి తడ రోడ్డు కాంపాలెం గిరిజన కాలనీ వద్ద అదుపుతప్పి శ్రీ సిటీ కి చెందిన బస్సు ముల్ల పొదల్లోకి దూసుకుపోయింది సోమవారం ఉదయం శ్రీ సిటీ నుంచి కార్మికులను ఎక్కించుకొని బిఎన్ కండ్రిగ కు వస్తుండగా కాం పాలెం గిరిజన కాలనీ వద్ద ఎదురుగా వస్తున్న వాహనం పైకి రావడం తో బస్సును డ్రైవర్ చాకచక్యంతో ముళ్ళ పొదల్లో కి తప్పించారు దీంతో బస్సులో ఉన్న కార్మికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు బస్సులో ఉన్న కార్మికులను జాగ్రత్తగా దింపి వేరే బస్సు లో పంపి ఎక్స్ కవేటర్ సహాయంతో బస్సును బయటకు తీశారు.