• Neti Charithra

అదుపు తప్పి నీటి కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి..!


అదుపు తప్పి నీటి కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి..!




తాడేపల్లి: నేటి చరిత్ర


కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందటం తో విషాదం చోటు చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. ఓ కుటుంబ సోమవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక

గ్రామానికి కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అవనిగడ్డ-విజయవాడ కృష్ణా కరకట్టపై అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో విస్సంశెట్టి దుర్గా మహలక్ష్మి(32), కుమారుడు

శ్రీమంత్‌(6) మృతి చెందారు. కిరణ్‌ కుమార్‌, 11 నెలలబాబు  ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.