• Neti Charithra

అద్దెకు ఇచ్చే.. ఇంటి యజమానులకు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్ !

అద్దెకు ఇచ్చే .. ఇంటి యజమానులకు..

ప్రభుత్వం... బంపర్ ఆఫర్ !

హైదరాబాదు: నేటి చరిత్ర (ఫిబ్రవరి1)

ఇల్లు అద్దెకు ఇచ్చేవారికి మరియు కారు , ఇతర వాహనాలు కోసం డ్రైవర్ లను ఏర్పాటు చేసుకునే వారికి తెలంగాణా పోలీసులు తీపి కబురు అందిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఇంటిని అద్దె కోసం ఇతరులకు ఇవ్వటం ఆనవాయితి. అలాగే కారు మరియు ఇతర వాహనాలకు వ్యక్తి గత విషయాలు తెలుసుకోకుండా డ్రైవర్ లుగా నియమించుకొని మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి మోసాలకు చెక్ పెడుతూ తెలంగాణా పోలీసులు సంచలన నిర్ణయాలు తీసుకోవటం పై పలువురు హర్షిస్తున్నారు.

వివరాలు లోకి వెళితే.. హైదరాబాదు

నగరంలో 17 లక్షల కుటుంబాలు (జీహెచ్‌ఎంసీ) లెక్కల ప్రకారం రాజధానిలో దాదాపు 20 లక్షల భవనాలున్నాయి. వాణిజ్య భవనాలు పోగా 17 లక్షల భవనాల్లో కుటుంబాలుంటున్నాయని అంచనా. నగరానికి వలసలు పెరుగుతుండటంతో అద్దె ఇళ్లకూ డిమాండ్‌ ఉంది. ఇదే సమయంలో ఇళ్లను అద్దెకిచ్చే విషయంలో యజమానులు అనేక సమస్యలెదుర్కొంటున్నారు. కొంతమంది అద్దెలివ్వడం లేదు... మరికొందరు ఖాళీ చేయడానికి ససేమిరా అంటున్నారు. ఇంకొందరు అద్దె ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది.

అద్దెకు తీసుకున్న వారి గత చరిత్ర ఇళ్ల యజమానులకు తెలియకపోవడంతో వారు ఈ రకమైన ఇబ్బందులెదుర్కొంటున్నారు. కారు డ్రైౖవర్లను నియమించుకోవాలనుకున్నప్పుడు, అపార్టుమెంట్లలో వాచ్‌మెన్ల విషయంలోనూ ఇదే సమస్య ఎదురవుతోందని పోలీసులు గుర్తించారు. తప్పతాగే అలవాటున్న వారు సైతం కారు డ్రైవర్‌గా నియమితులై అనేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవలి కాలంలో అనేకమంది తమ ఇబ్బందులను హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ దృష్టికి తీసుకురాగా...దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షించిన ఆయన బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంటిని అద్దెకివ్వాలనుకున్న వారు అద్దెకు తీసుకోవడానికి వచ్చే వారి ఆధార్‌ కార్డు లేదా ఇతరత్రా వివరాలను సంబంధిత పోలీసుస్టేషన్‌లో అందజేస్తే వారం రోజుల వ్యవధిలో విచారించి సమగ్ర నివేదికను పోలీసులు అందజేస్తారు. గత కొంతకాలంగా దాదాపు అయిదువేల మంది గురించి పోలీసులు విచారించి నివేదికలను అందజేశారు. మహా నగరంలో 63 పోలీసుస్టేషన్లున్నాయని సహాయం అవసరమైన వ్యక్తులు అక్కడికి వెళ్లి దరఖాస్తు చేస్తే సరిపోతుందని పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

మీడియా కు వివరించారు