- Neti Charithra
అతి వేగం తో దూసుకొచ్చిన కారు.. ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు..!
అతి వేగం తో దూసుకొచ్చిన కారు.. ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు..!
గుంటూరు: నేటి చరిత్ర
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంగా వస్తోన్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా
గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు దాచేపల్లి మండలం గామాలపాడు వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టింది. తర్వాత పక్కనున్న నివాసాలపైకి దూసుకుపోయిన కారు గోడలకు ఆనుకుని తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయింది. దీంతో కారులో ఉన్న వారిలో ఒక యువకుడితో సహా మరొక వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గురజాల
ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమది నెల్లూరని, హైదరాబాదు నుంచి వస్తున్నామని గాయపడిన ఒక మహిళ చెప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.