• Neti Charithra

అత్యుత్సహం తో.. టీడీపీ నేతను హత్య కేసులో ఇరికించిన సిఐ సస్పెండ్ !


అత్యుత్సాహం.. తో టీడీపీ నేతను హత్య కేసులో ఇరికించిన సీఐ సస్పెండ్ !


గుంటూరు: నేటి చరిత్ర (ఫిబ్రవరి28)


కొందరు పోలీసులు రాజకీయ నాయకుల సిఫార్సులకు తలొగ్గి వాస్తవాలను పట్టించుకోకుండా, విధుల్లో వక్రబుద్ధి చూపిస్తూ క్రమశిక్షణ రాహిత్య చర్యలకు గురవుతున్నారు. ఈ ఘటనలు తరచూ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.



గుంటూరు జిల్లా లో జరిగిన ఓ హత్య కేసులో అనవసరం గా ఓ టీడీపీ నేతను ఇరికించిన సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన ఘటన సంచలనం కలిగించింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఫిబ్రవరి 16న నిజాంపట్నం మండలంలో మోపిదేవి రాంబాబు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.  వివాహేతర సంబంధం, వ్యాపార లావాదేవీల నేపథ్యంలో రాంబాబును ఆయన తోడల్లుడు సీతారామయ్య, అతని అనుచరుడు హరీష్‌ కలిసి గోకర్ణమఠం వద్ద హత్య చేశారని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రేపల్లె మండల మాజీ  ఉపాధ్యక్షుడు, తెదేపా నేత కొపనాతి రాజశేఖర్‌ను పోలీసులు అనుమానించారు. మృతుడు రాంబాబుకు రాజశేఖర్‌కు బంధుత్వం ఉంది. ఈ క్రమంలో రాజశేఖర్‌ అతనికి అప్పుడప్పుడు ఫోన్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ సారి ఫోన్‌ చేసినపుడు రాంబాబు స్పందించక పోవడంతో అతని ఫోన్‌లో మిస్‌కాల్‌ ఉంది. దీని ఆధారంగా పోలీసులు రాజశేఖర్‌ను  పిలిచి విచారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా అడిషనల్‌ ఏఎస్పీ నిజాంపట్నం వెళ్లి ఘటనపై విచారించారు. హత్య కేసులో రాజశేఖర్‌ ప్రమేయం లేదని, విచారణలోనే లోపాలున్నట్లు నిర్ధరించి నివేదిక అందజేశారు. దీంతో ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఈనెల 26న రేపల్లె సర్కిల్‌ సీఐపై సస్షెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.




1,104 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon