• Neti Charithra

అత్యాచారానికి గురైన నాలుగు యేళ్ళ బాలిక కు హెచ్ ఐ వి!

# హత్యచారనికి గురైన నాలుగు యేళ్ళ బాలిక కు హెచ్ ఐ వి!

జైపూర్: నేటి చరిత్ర రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి హెచ్ ఐ వి సోకిన దారుణ ఘటన వెలుగుచూసింది. జైపూర్ నగరానికి చెందిన ఓ కరడుకట్టిన కామాంధుడు నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అత్యాచారానికి గురైన బాలికను రెండు రోజుల తర్వాత పరీక్షిస్తే, ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. అత్యాచారం చేసిన నిందితుడికి హెచ్ఐవీ సోకిందని, ఆయన ద్వార బాధిత బాలికకు వ్యాధి సోకడంతో బాలిక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.హెచ్ఐవీ పాజిటివ్ అని రిపోర్టు రావడంతో బాలికకు ప్రభుత్వ వైద్యులు మందులు ఇచ్చారు. బాలిక జీవితాంతం మందులు వాడాలని వైద్యులు సూచించారు. ప్రస్థుతం జైల్లో ఉన్న నిందితుడు గతంలో పలువురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. సీరియల్ నేరగాడికి జైల్లో పరీక్షలు చేయగా అతనికి హెచ్ఐవీ పాజిటివ్ అని వచ్చిందని జైలు అధికారులు చెప్పారు.