- Neti Charithra
అత్త.. పై అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించి న అల్లుడు !

అత్త .. పై అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించి న అల్లుడు !
నెల్లూరు: నేటి చరిత్ర (ఫిబ్రవరి10)
నెల్లూరు జిల్లా
అనంతసాగరం మండలం గౌరవరానికి చెందిన చల్లా లక్ష్మమ్మపై ఆమె అల్లుడు వెంకటరమణ ఆదివారం రాత్రి పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆత్మకూరులోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. లక్ష్మమ్మ కుమార్తె జయమ్మ కథనం ప్రకారం.. వెరుబొట్లపల్లిలో ఉంటున్న తనకు ఆరోగ్యం బాగా లేకపోవటంతో గౌరవరంలోని తల్లి వద్దకు వచ్చారు. భార్య కోసం గౌరవరంలోని అత్త గారింటికి వచ్చిన వెంకటరమణ రాత్రి పడుకొనేందుకు మంచం వేయాలని భార్యను కోరాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదానికి అత్త అడ్డురావటంతో తన మోటారు సైకిల్లోని పెట్రోలు తీసి అత్తపై పోసి అగ్గి పుల్ల వెలిగించి నిప్పంటించాడు. కాలిన గాయాలైన లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించారు.

30 views0 comments