• Neti Charithra

అడంగల్..కోసం.. రూ.50 వేలు డిమాండ్ చేశాడని విఆర్వో పై పెట్రోల్ దాడి..చేసిన రైతు..!


అడంగల్..కోసం.. రూ.50 వేలు డిమాండ్ చేశాడని విఆర్వో పై పెట్రోల్ దాడి..చేసిన రైతు..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


గుంటూరు జిల్లా రావెల గ్రామ సేవకుల సంఘం భవనంలో గ్రంధశిరి ఇన్‌ఛార్జి వీఆర్వో కె.మోహనరావున్న గదిలో శుక్రవారం అదే గ్రామ రైతు పరుచూరి రామకృష్ణ పెట్రోలు పోసిన సంఘటన

జరిగింది. వీఆర్వో తెలిపిన వివరాల మేరకు.. గ్రంధశిరి వాసి రావెళ్ల లవణకుమార్‌ తమ గ్రామ పొలం ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇవ్వాలని, తాను రెవెన్యూ కార్యాలయంలో సంతకాలు చేయించుకుంటానని తనపై దౌర్జన్యం చేసినట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో రామకృష్ణ తండ్రితో కలిసి అక్కడకు వచ్చి అండగల్‌ గురించి అడిగి, తన వెంట తెచ్చిన పెట్రోలు పోసేందుకు యత్నించగా, తండ్రి సీసాను పట్టుకోవడంతో అది గదిలో పడిపోయిందన్నారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి బాబూరావు ఆన్‌లైన్‌ అడంగల్‌కు రెండు నెలల కిందట

దరఖాస్తు చేశానన్నారు. వీఆర్వో మోహనరావు తమ వద్ద రూ.30వేలు లంచంగా తీసుకున్నాడని, మరో రూ.20వేలు డిమాండ్‌ చేశాడని ఆరోపించారు. దీంతో తాను వీఆర్వో ఉన్న గదిలో పెట్రోలు తనపై పోసుకునేందుకు ప్రయత్నించానన్నారు.


414 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon