• Neti Charithra

అటెండర్ కు కరోనా పాజిటివ్.. మూతపడ్డ చిత్తూరు డీఈవో కార్యాలయం..!


అటెండర్ కు కరోనా పాజిటివ్.. మూతపడ్డ చిత్తూరు డీఈవో కార్యాలయం..!
చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది.చిత్తూరు విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి సోమవారం కరోనా పాజిటివ్ రావడంతో కార్యాలయం మూసి వేశారు. అధికారులు

కార్యాలయంలో శానిటైజేషన్ చేశారు. ఈ ఘటన తో డీఈవో కార్యాలయాన్ని అధికారులు రెడ్ జోన్ ఏరియా గా ప్రకటించారు. కార్యాలయానికి సిబ్బంది తోపాటు ఇతర పనులపై వచ్చే ఉపాధ్యాయులకు మళ్ళీ కార్యాలయం తెరిచే వరకు రావద్దని డీఈవో నరసింహారెడ్డి

సూచించారు. అయితే డీఈవో కార్యాలయంలో కరోనా పాజిటివ్ వచ్చిన అటెండర్ తో సన్నిహితంగా మెలిగిన కార్యాలయ ఉద్యోగులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు.