- Neti Charithra
అటవీ ప్రాంతం లో నాటు తుపాకీ కల కలం .. ఒకరి పరిస్థితి విషమం !

అటవీ ప్రాంతం లో నాటు తుపాకీ కల కలం .. ఒకరి పరిస్థితి విషమం !
విజయనగరం: నేటి చరిత్ర
విజయనగరం జిల్లాలో బుధవారం
కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుమ్మలక్ష్మీపురం దేరువాడ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అటవీ జంతువుల వేటకు వెళ్లిన వ్యక్తులు అటవీ జంతువుల కోసం తుపాకీ పేల్చగా
ఆ సమయంలో అటవీ ప్రాంతంలో వెళ్తున్న దొరవలసకు చెందిన గౌరు అనే వ్యక్తికి ఛాతి భాగంలో బుల్లెట్ తగిలి గాయమైంది. క్షతగాత్రుడికి ముందుగా కురుపాం

ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

130 views0 comments