• Neti Charithra

అటవీ ప్రాంతం లో చిక్కుకున్న బాలుడు.. కాపాడిన తవణం పల్లె పోలీసులు!


అటవీ ప్రాంతం లో చిక్కుకున్న బాలుడు.. కాపాడిన తవణం పల్లె పోలీసులు!తవణం పల్లె: నేటి చరిత్రచిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మాధవరం అటవీ ప్రాంతంలో ఓ బాలుడు తప్పిపోయాడు. గమనించిన పశు కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు బాలుడిని తమ అధీనం లోకి తీసుకున్నారు.

తప్పిపోయిన బాలుణ్ణి తవణంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి చేరదీశారు.అతని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.ఈ బాలుని తల్లిదండ్రులు గురించి దర్యాప్తు చేస్తున్నారు.బాలుడు మాటలు రాకుండా మూగ సైగలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.