• Neti Charithra

అటవీ జంతువుల వేటకు వెళ్లిన .. వ్యక్తి మృతి.. చిత్తూరు జిల్లా లో ఘటన!


అటవీ జంతువుల వేటకు వెళ్లిన .. వ్యక్తి మృతి.. చిత్తూరు జిల్లా లో ఘటన!


కుప్పం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా కుప్పం మండలం లో అటవీ జంతువుల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుత్ తీగెలు తగిలి మృతి చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పంమండలం నులుకుంటా గ్రామానికి చెందిన కుట్టేప్ప తో పాటు 10 మంది వరకు అటవీ జంతువుల వేట కు

వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా పంట పొలాలలో అమర్చిన అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి వేట కు వెళ్లిన కుట్టేప్ప అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఈ ప్రమాదం తో నులుకుంటా గ్రామం లో విషాదం నెలకొంది.