- Neti Charithra
అక్రమ సంబంధం కొనసాగిస్తు న్న హెచ్ ఎం కు దేహ శుద్ధి చేసిన విద్యార్థులు!

#అక్రమ సంబంధం కొనసాగిస్తు న్న హెచ్ ఎం కు దేహ శుద్ధి చేసిన విద్యార్థులు!
భువనేశ్వర్: నేటి చరిత్ర (నవంబర్3) స్కూల్లో పనిచేస్తున్న సహచర ఉద్యోగినితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఓ ప్రిన్సిపాల్‌కి విద్యార్థులు దేహశుద్ది చేశారు. వివరాలు.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా హసన్పూర్ గ్రామంలోని రెసిడెన్సియల్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్ లోచన్.. సహ ఉద్యోగి సబితా బిస్వాల్‌తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. అంతటితో ఆగకుండా పాఠశాల ఆవరణలోనే ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాలలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఒకసారి హెచ్చరించి వెళ్లారు. అయినప్పటికీ వారు బుద్ధి మార్చుకోకపోవడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పాఠశాల వాతావరణాన్ని చెడగొడుతున్న వారిద్దరినీ సస్పెండ్ చేయాలంటూ తొలుత విద్యార్థులు ఆందోళకు దిగారు. ఈ సమయంలోనే గ్రామస్తులంతా అక్కడికి చేరుకోవడంతో రాజీవ్‌పైకి దాడికి దిగారు. అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి వ్యవహారంపై విచారణ జరపుతున్నారు.