- Neti Charithra
అక్రమ రవాణా చేస్తూ..భారీగా పట్టుపడ్డ సింహాల ఎముకలు.. !

#అక్రమ రవాణా చేస్తూ..భారీగా పట్టుపడ్డ సింహాల ఎముకలు.. !
హైదరాబాద్ : నేటి చరిత్ర (అక్టోబర్4) సుమారు 342 కిలోల సింహాల ఎముకలను సౌతాఫ్రికా పోలీసులు సీజ్ చేశారు. జోహాన్నస్బర్గ్ ఎయిర్పోర్ట్లో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆసియా దేశాల్లో మృగరాజుల ఎముకలకు భారీ డిమాండ్ ఉంది. వాటిని మందుల తయారీలో వాడుతారు. నగల తయారీలోనూ వాడుతారట. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్పోర్ట్కు వచ్చిన ఓ షిప్మెంట్ ను అధికారులు పరీక్షించారు. దాంట్లో 12 బాక్సుల్లో సింహాల ఎముకలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతి ఉంటేనే సింహాల ఎముకలను విదేశాలకు తరలించవచ్చు. సౌతాఫ్రికాలో 11 వేల సింహాలు ఉన్నాయి.

9 views0 comments