• Neti Charithra

అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుపడ్డ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి..!


అక్రమ మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుపడ్డ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి..!
అమరావతి: నేటి చరిత్ర

(పోలీసులకు పట్టుపడ్డ బిజెపి నేత)అక్రమ మద్యం తరలిస్తూ ఏపీ భాజపా నేత ఒకరు పట్టుబడ్డారు. తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంబిబాబును  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.6లక్షలు విలువైన 1,920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాక రామాంజనేయులు సహా మచ్చా సురేశ్‌, కె. నరేశ్‌, గంటా హరీశ్‌ను అరెస్ట్‌ చేశారు. రామాంజనేయయులను ఏ-1గా పేర్కొన్నారు. గుంటూరు ఏఈఎస్‌ చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా

రామాంజనేయులు పోటీ చేశారు. కాగ పోలీసులకు పట్టుపడ్డ బిజెపి నేత రామాంజనేయులు ను సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు.