• Neti Charithra

అక్రమ మద్యం..తరలిస్తూ.. పోలీసులకు పట్టు పడ్డ గ్రామ వాలంటీర్..!


అక్రమ మద్యం..తరలిస్తూ.. పోలీసులకు పట్టు పడ్డ గ్రామ వాలంటీర్..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)

కృష్ణా జిల్లా లో ఇతర రాష్ట్రానికి

చెందిన అక్రమ మద్యం తరలిస్తున్న ఓ గ్రామ వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసులు కథనం మేరకు..

తిరువూరుమండలంలోని ముష్టికుంట్ల వాలంటీర్‌గా పనిచేస్తున్న పి.రామకృష్ణ

మధిర నుంచి మద్యం తరలిస్తుండగా చింతలపాడు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సెక్టార్‌-1 ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇతని నుంచి 70 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, ద్విచక్ర వాహనం సీజ్‌ చేశామన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.