- Neti Charithra
అక్రమంగా తరలిస్తున్న కోటి 80 వేలు.. కరెన్సీ పట్టుకున్నాం- డిఎస్పీ చిదానంద రెడ్డి!
అక్రమంగా తరలిస్తున్న కోటి 80 వేలు.. కరెన్సీ పట్టుకున్నాం- డిఎస్పీ చిదానంద రెడ్డి!
నంద్యాల: నేటి చరిత్ర
కర్నూలు జిల్లా నంద్యాల మండల పరిధిలోని చాపిరేవుల టోల్‌గేటు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.కోటికి పైగా నగదును పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి విలేకర్లకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని చార్మినార్
ప్రాంతానికి చెందిన గైక్వాడ్ దత్తాత్రేయ విఠల్, మలక్‌పేటకు చెందిన కాశీనాథ్‌లు కోయంబత్తూరుకు టాటా హెక్సా (టీఎస్ 12 ఈఎఫ్ 9003)లో బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున చాపిరేవుల టోల్‌గేటు వద్ద పాణ్యం సీఐ జీవన్గంగనాథ్ బాబు తనిఖీ చేస్తుండగా కారులో రూ.కోటి 80 వేల నగదు ఉన్నట్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరినీ విచారించగా బంధువులు ఆసుపత్రిలో
ఉన్నారని..చికిత్సకోసం నగదును తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో కారును, నగదును స్వాధీనం చేసుకుని పాణ్యం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి నగదును ఐటీ అధికారులకు అప్పగించామని డీఎస్పీ వెల్లడించారు